Rishabh Pant become fourth Indian wicketkeeper to takes 100 catches in Test cricket: వికెట్ కీపింగ్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ (Rishabh Pant).. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 క్యాచులు పట్టిన నాలుగో భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో.. టెస్టుల్లో 100వ క్యాచ్ (100 Catches In Test Cricket) టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఖాతాలో చేరింది. 24 ఏళ్ల పంత్ కేవలం 27 టెస్టుల్లోనే 100 క్యాచులు సాధించడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) 256 క్యాచులతో.. అత్యధిక క్యాచులు అందుకున్న భారత వికెట్‌ కీపర్‌ (Indian Wicketkeeper)గా తొలి స్థానంలో ఉన్నాడు. భారత మాజీ ఆటగాళ్లు సయ్యద్ కిర్మాణీ (160 క్యాచులు), కిరణ్‌ మోరె (110) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతుండగా.. నాలుగో స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. అంతకుముందు సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచులో పంత్‌.. మహీ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 26 టెస్టుల్లోనే 100 డిస్మిసల్స్ (క్యాచ్‌ + స్టంపౌట్లు) నమోదు చేసిన ఆటగాడిగా పంత్‌ రికార్డులోకి ఎక్కాడు. ధోనీ 36 టెస్టుల్లో 100 డిస్మిసల్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.


Also Read: Pushpa In OTT: ఎల్లుండి నుండే అమెజాన్ ప్రైమ్‏లో 'పుష్ప'.. అఫీషియల్ అనౌన్స్మెంట్!


జొహాన్నెస్ బర్గ్‌లో జరుగుతోన్న రెండో టెస్టు (Johannesburg Test) రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 85/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియాకు ఛెతేశ్వర్‌ పుజారా (Pujara), అజింక్య రహానే (Rahane) మంచి స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పుజారా హాఫ్ సెంచరీ (51) చేయగా.. రహానే (48) చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయడంతో.. ప్రొటీస్ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.


Also Read: Sana Ganguly Covid 19: సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్.. సనా గంగూలీకి పాజిటివ్! ఆందోళనలో దాదా ఫ్యామిలీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook