IND vs SA: అజింక్య రహానేపై వేటు.. ఇక టెస్ట్ వైస్ కెప్టెన్సీ కూడా అతడికే! దక్షిణాఫ్రికా సిరీస్ ఆలస్యం!!
ఇటీవలే భారత జట్టు టీ20 పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు త్వరలోనే మరో బాధ్యత కూడా అప్పజెప్పే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి రోహిత్‌కు ఆ పదవి ఇవ్వనుంది.
Rohit Sharma Likely to be Appointed as Team India's Test Vice Captain: ఇటీవలే భారత జట్టు టీ20 పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ (Rohit Sharma)కు త్వరలోనే మరో బాధ్యత కూడా అప్పజెప్పే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ (Test Vice Captain)గా రోహిత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానే (Ajinkya Rahane)ను తప్పించి రోహిత్‌కు ఆ పదవి ఇవ్వనుంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడనుందట. రహానే ఓ బ్యాటర్‌గా వరుసగా విఫలమవడమే ఇందుకు కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే టీమిండియా వన్డే జట్టులో చోటు కోల్పోయిన అజింక్య రహానే (Ajinkya Rahane).. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. టెస్ట్‌ల్లో కూడా గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గతేడాది మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. స్వదేశంలో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ జింక్స్ విఫలమయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చే రహానే.. బాధ్యతారహితంగా ఆడాడు. మొదటి ఇన్సింగ్స్‌లో 35 పరుగులు చేసిన జింక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ముంబై టెస్ట్ (Mumbai Test)కు జట్టులో చోటు కోల్పోయాడు. జింక్స్ తన చివరి 16 టెస్టుల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
Also Read: Breaking News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత!
కాన్పూర్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ, అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో జట్టులో అజింక్య రహానే (Ajinkya Rahane) స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రహానేకు జట్టులో చోటు దక్కకపోతే.. వైస్ కెప్టెన్ పదవి ఖాళీగా ఉంటుంది. అందుకే టెస్టుల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్న రోహిత్ శర్మ (Rohit Sharma)కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో రానుందని సమాచారం తెలుస్తోంది. మరోవైపు త్వరలో వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా రోహిత్‌కే దక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Omicron: కెనడాలో ఒమిక్రాన్ కలకలం-15 కేసులు గుర్తింపు-ఆరోగ్య శాఖ కీలక విజ్ఞప్తి
టీమిండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు వెళ్లనుంది. అక్కడ టెస్ట్, వన్డే, టీ20 సిరీసులు ఆడనుంది. ఈ పర్యటన డిసెంబర్ 17న ఆరంభం కానుంది. ఈ నెల 8న భారత జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే బీసీసీఐ తొమ్మిది రోజులు ఆలస్యంగా ఈ పర్యటనకు వెళ్లాలని చూస్తోందని సమాచారం. ఆలోగా దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ పరిస్థితులను పర్యవేక్షించాలనుకుంటోంది. దాంతో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌తో ఈ పర్యటన ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook