IND vs SA: ఫామ్‌లో దక్షిణాఫ్రికా త్రయం.. టీమిండియా గెలవడం కష్టమే! రాహుల్ సేన గెలిస్తే చరిత్రే
IND vs SA: South Africa T20 Records scare to Team India. భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20ల్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఇరు జట్లు జూన్ 9 నుంచి 19 వరకు జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.
IND vs SA, South Africa team arrives India fo T20 Series: రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2022 తాజాగా ముగిసిన విషయం తెలిసిందే. ఇక భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20ల్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఇరు జట్లు జూన్ 9 నుంచి 19 వరకు జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు నేడు ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న జరగనున్న తొలి మ్యాచ్ కోసం ప్రొటీస్ త్వరలోనే ప్రాక్టీస్ మొదలెట్టనుంది. భారతప్లేయర్లు జూన్ 5న ఢిల్లీకి చేరుకోనున్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 15 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 9 మ్యాచులు గెలవగా.. ప్రొటీస్ 6 గేమ్స్ గెలిచింది. అయితే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి కూడా గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ రెస్ట్ ఓ కారణం అయితే.. ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫుల్ ఫామ్‌లో ఉండడం ఇంకో కారణం. ఒకవేళ రాహుల్ సేన గెలిస్తే మాత్రం భారత జట్టు సొంత గడ్డపై తొలిసారి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంటుంది.
అక్టోబర్ 2015 (ప్రోటీస్ 2-0తో గెలిచింది) మరియు సెప్టెంబర్ 2019 (1-1 డ్రా) తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారతదేశంలో టీ20 సిరీస్ ఆడడం ఇది మూడోసారి. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2022లో చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మిల్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టడంలో సహాయపడ్డాడు. ఈ ముగ్గురు చెలరేగితే.. టీమిండియాకు కష్టమే. వీరితో పాటుగా మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్జ్, డ్వేన్ ప్రిటోరియస్, రోస్సీ వాన్ డెర్ డ్యూసెన్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నారు.
ఐదు మ్యాచుల సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జూన్ 9న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం టీ20ల్లో భారత్ వరుసగా 12 విజయాలతో దూసుకెళుతోంది. 12 విజయాలతో ఆఫ్ఘనిస్థాన్, రొమేనియాతో భారత్ సమానంగా ఉంది. తొలి మ్యాచులో గెలిస్తే.. ఆ రెండు దేశాలను భారత్ అధిగమిస్తుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్లు జూన్ 12న కటక్‌లో, జూన్ 14న విశాఖపట్నంలో, జూన్ 17న రాజ్‌కోట్‌లో, జూన్ 19న బెంగళూరులో ఆడనున్నాయి.
Also Read: Ante Sundaraniki Trailer: ఇంకా ఉన్నది ఒకటే ఆప్షన్.. లేచిపోవడమే! 'అంటే సుందరానికి' ట్రైలర్ అదుర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook