IND vs SA: కెప్టెన్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..!
IND vs SA: అంతర్జాతీయ టీ20ల్లో భారత జోరు కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది. ఈనేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు.
IND vs SA: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. తిరువనంతపురం మ్యాచ్‌లో టీమిండియా రఫ్ఫాడించింది. బౌలింగ్‌లో అదరగొట్టింది. సౌతాఫ్రికా జట్టును అతి తక్కువ స్కోర్‌కు ఆలౌట్ చేసి..లక్ష్యాన్ని చేధించింది. ఈమ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ..కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. ఈనేపథ్యంలో టీ20 మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డు సాధించాడు.
ఈఏడాదిలో కెప్టెన్ రోహిత్ శర్మకు 16వ టీ20 విజయం. దీంతో అతడు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. 2016లో ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 15 టీ20 మ్యాచ్‌ల్లో విజయ ధుంధుంబి మోగించింది. దక్షిణాఫ్రికాతో గెలుపు తర్వాత ధోనీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
త్వరలో రోహిత్ శర్మ ఖాతాలో మరికొన్ని రికార్డు నమోదు అవుతాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 13 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో టీ20 వన్డే సిరీస్‌ల తర్వాత ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది. అక్కడే తన తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని టీమిండియా ఆశిస్తోంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యను అధికమిస్తే..కప్ గెలవడం ఖాయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also read:5G Services: రేపటి నుంచి దేశంలో 5జీ సేవలు..ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
Also read:Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.