IND vs SA: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో..తాజాగా రెండు రికార్డులు బ్రేక్..!
IND vs SA: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. వరుసగా హాఫ్ సెంచరీలను తన ఖాతాల్లో వేసుకుంటున్నాడు. తాజాగా మరో రెండు రికార్డులు బద్ధలైయ్యాయి.
IND vs SA: స్వదేశంలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. దక్షిణాఫ్రికాపై మరో మ్యాచ్ గెలిస్తే..టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోనుంది. అక్టోబర్ 2న గౌహతి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టును టీమిండియా చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విశేషంగా రాణించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ 50 పరుగులు, కేఎల్ రాహుల్ 51 పరుగులతో అలరించారు.
దీంతో 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా చేధించింది. ఈక్రమంలో సూర్యకుమార్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. భారత సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డుతోపాటు పాక్ ఓపెనర్ రికార్డును బద్ధలు కొట్టాడు. టీ20ల్లో ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 2018లో శిఖర్ ధావన్ 689 పరుగులు చేశాడు. తాజాగా యువ ప్లేయర్ సూర్యకుమార్ 732 పరుగులు సాధించాడు.
వీటితోపాటు అత్యధిక సిక్సర్లు బాదిగా ప్లేయర్‌గానూ నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ 2021లో 42 సిక్సర్లు బాదాడు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో 45 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 26 ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ అత్యధిక సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం కేవలం 21 ఇన్నింగ్స్‌లోనే రికార్డును సాధించాడు. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
Also read:Minor Rape Case: మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు..!
Also read:Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి