Virat Kohli Fans: అనుష్క శర్మతో బిజీగా ఉన్నా.. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి! విరాట్ కోహ్లీ వీడియో వైరల్
Virat Kohli In Video Call With Anushka Sharma. అభిమానుల పిలుపుకు స్పందించిన విరాట్ కోహ్లీ.. వెంటనే బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నా అని తన ఫోన్‌ను చూపించాడు.
Virat Kohli talks video cal with Anushka Sharma in team bus: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్ (32/3), దీపక్ చహర్ (24/2) దెబ్బకు ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (41; 35 బంతుల్లో 5×4, 2×6), మార్‌క్రమ్ (25; 24 బంతుల్లో 3×4, 1×6), పార్నెల్ (24; 37 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్; 33 బంతుల్లో 5×4, 3×6)తో పాటు కేఎల్ రాహుల్ (51 నాటౌట్; 56 బంతుల్లో 2×4, 4×6) రాణించడంతో భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అక్టోబర్ 2న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బుధవారం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు భారత జట్టు బృందం బస్సులో బయలుదేరింది.హోటల్ బయట అప్పటికే అభిమానులు భారీ ఎత్తున గూమిగూడారు. టీమిండియా క్రికెటర్లు బస్సు ఎక్కగానే.. అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని చూడగానే అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. కోహ్లీ, కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు.
అభిమానుల అరుపులు బస్సులో ఉన్న విరాట్ కోహ్లీకి వినబడ్డాయి. ఆ సమయంలో కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లీ.. వెంటనే బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నా అని తన ఫోన్‌ను చూపించాడు. దాంతో ఫాన్స్ మరింత గట్టిగా అరవగా.. విరాట్ నవ్వుకుంటూ అనుష్కతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అనుష్క శర్మతో బిజీగా ఉన్నాడు కోహ్లీ' అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'ఫీల్డింగ్'కా బాప్.. సురేష్ రైనా క్యాచ్ చూస్తే బిత్తరపోవాల్సిందే! చిరుత కంటే వేగంగా డైవ్
Also Read: Union Govt: ఏపీలో మరో కొత్త జాతీయ రహదారి..విజయవాడ నుంచి ఎక్కడి వరకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook