Why A Test match starting on December 26 will be called Boxing Day Test: సెంచూరియన్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్​ డే' టెస్టు (Boxing Day Test) అని పిలుస్తారు. ఇదొక్కటే కాదు క్రిస్మస్​ తర్వాతి రోజున ఆరంభం అయ్యే ఏ టెస్ట్ మ్యాచును అయినా 'బాక్సింగ్​ డే' టెస్టు అని పిలుస్తారు.  క్రికెట్, బాక్సింగ్ రెండు వేర్వేరు క్రీడలు కదా?.. మరి 'బాక్సింగ్​ డే టెస్టు' అని ఎందుకు పిలుస్తారు అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఇక కొందరి మెదడులో ఈ ప్రశ్న తిరుగుతుంటుంది. అయితే ఈ పేరు వెనుకున్న కథేంటి? అని తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాశ్చాత్య క్రైస్తవ మత క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ పండగ తర్వాత రోజు (డిసెంబర్ 26)ను 'బాక్సింగ్‌ డే'గా (Boxing Day Test) పాటిస్తారు. క్రిస్మస్​ తర్వాతి రోజున అందరూ తమ బంధవులను, స్నేహితులు, సేవకులకు బహుమతుల బాక్సులను (క్రిస్మస్ బాక్స్) అందజేస్తారు. అందులో ఆహార ప్రదార్థాలు, నగదు, ఇతర వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా డిసెంబరు 26న తమ వద్ద పనిచేసే వారందరికి యజమానులు సెలవు ఇచ్చి.. వారికి కానుకలను అందజేస్తారు. ఆ రోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ.. వారికి వచ్చిన బహుమతి బాక్సులను పరిశీలిస్తారు. దాంతో ఆ రోజును 'బాక్సింగ్​ డే' అని పిలవడం ప్రారంభించారు.


Also Read: Leopard Attack Pet Dog: గేటు దూకి పెంపుడు కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే షాకే!!


బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో క్రిస్మస్​ తర్వాతి రోజును 'బాక్సింగ్​ డే'గా జరుపుకుంటారు. దాంతో ఆ రోజు మొదలయ్యే టెస్ట్ మ్యాచును 'బాక్సింగ్​ డే టెస్టు' అని పిలవడం ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈరోజున మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఆరంభం అవుతుంది. దానిని బాక్సింగ్​ డే టెస్టుగా పిలుస్తారు. 1950 నుంచి ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ​మధ్య మొదటిసారి 1950లో బాక్సింగ్​ డే టెస్టు జరిగింది. ఆ తర్వాత కూడా వివిధ దేశాలతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడాయి.


1950లో బాక్సింగ్​ డే టెస్టు (Boxing Day Test)గా ముద్రపడిపోయినా.. 1963 వరకు డిసెంబరు 26న టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాలేదు. కానీ ఆరోజు ఆటలో ఉండేలా షెడ్యూల్ చేశారు. 1973 నుంచి డిసెంబరు 26న టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయ్యేలా చూసారు. అయితే కొన్ని కారణాలతో 1976 నుచి 1979 వరకు బాక్సింగ్​ డే రోజు మ్యాచ్ ఆరంభం కాలేదు. ఇక 1980 నుంచి ప్రతి ఏడాది డిసెంబరు 26న టెస్ట్ మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ పెద్ద స్టేడియం కాబట్టి.. బాక్సింగ్​ డే టెస్టును అక్కడే నిర్వహిస్తారు. ఇప్పటివరకు భారత్ 8 బాక్సింగ్​ డే టెస్టులు ఆడగా.. ఒక దాంట్లో గెలిచి ఐదింటిలో ఓడింది. 


Also Read: Jahnavi Kapoor: తిరుమల శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు..లంగావోణీలో మెరిసిన జాన్వీ కపూర్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి