Sri Lanka have won the toss and have opted to field: సొంతగడ్డపై వెస్టిండీస్​తో జరిగిన వన్డే, టీ20 సిరీస్​లు క్లీన్​స్వీప్ చేసిన భారత్.. శ్రీలంకతో టీ20 పోరుకు సిద్ధమైంది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లంక కెప్టెన్ దాసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా​ బ్యాటింగ్​కు దిగనుంది. ఇది చాలా మంచి పిచ్ అని, గత కొన్ని మ్యాచులలో బాగా బౌలింగ్ చేయడం మాకు కలిసొస్తుంది అని లంక కెప్టెన్ చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్ కోసం జట్టులో ఆరు మార్పులు చేసినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఆడడం లేదన్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ర‌వీంద్ర జ‌డేజా, జ‌స్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, దీపక్ హుడా రీఎంట్రీ ఇచ్చారు. స్టార్ ఆటగాళ్లు దూరమయినా భారత్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. మరోవైపు లంకలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. 


ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్​తో జరిగిన మూడు వన్డే, మూడు టీ20 సిరీస్​లు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ క్లీన్​స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఆపడం లంకకు కాస్త కష్టమనే చెప్పాలి. భారత్, శ్రీలంక మధ్య మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో టీమిండియా 14 విజయాలు సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.



తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్. 
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ (కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార. 


Also Read: Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!


Also Read: Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook