IND vs SL, Shubman Gill and Shivam Mavi are makes T20 debut: టీ20 సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా శుభ్‌మన్ గిల్, శివమ్ మావిలు టీ20 అరంగేట్రం చేశారు. మరోవైపు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఎక్కువగా యువకులకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో ఆడిన శుబ్‌మన్‌ గిల్.. తాజాగా టీ20 ఫార్మాట్‌లోనూ జట్టులోకి వచ్చేశాడు. యువ బౌలర్ శివమ్ మావి భారత్ తరఫున ఇదే మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు పేసర్ అర్ష్‌దీప్‌ అందుబాటులో ఉండడని కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.


శ్రీలంకతో టీ20 సిరీస్‌ ముంగిట సోషల్ మీడియాలో భారత క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సహచర ఆటగాళ్లతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను పంచుకున్నాడు. ఇందులో ఆటగాళ్లు ధరించిన జెర్సీలపై ఓ చిన్న మార్పు ఉంది. కుడి వైపున ఉండే స్ఫాన్సర్‌షిప్‌ లోగో మారినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. 



తుది జట్లు:
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్‌ పటేల్, శివమ్‌ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్. 
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్‌ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్‌ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక.