100 percent spectators allowed in India vs Sri Lanka Day Night Test: ఇటీవలి కాలంలో టీ20, వన్డే, టెస్ట్ అనే తేడా లేకుండా భార‌త్‌ వరుస విజయాలతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. స్వదేశంలో వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. శ్రీలంకపై టీ20 సిరీస్‌ను కూడా 3-0 కైవసం చేసుకుంది. ఇక ఇప్పటికే ఓ టెస్ట్ మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. లంకతో మరో సమరానికి సిద్ధమైంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా శ‌నివారం నుంచి భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య‌ జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు (డేనైట్ టెస్ట్) మ్యాచ్‌ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య‌ జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమ‌తించ‌నున్నారు. ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ అధికారులు అధికారికంగా ధృవీక‌రించారు. ముందుగా స్టేడియంకు 50 శాతం ప్రేక్ష‌కుల‌నే అనుమ‌తించాల‌ని భావించిన‌ప్ప‌టికీ.. క‌ర్ణాట‌క‌తో పాటు దేశంలో క‌రోనా థర్డ్ వేవ్ కేసులు భారీగా త‌గ్గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. దాంతో చాలాకాలం త‌ర్వాత భారత్ ఆడ‌బోయే మ్యాచ్ 100 శాతం ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో జ‌ర‌గబోతుంది.


క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ తాజా నిర్ణయంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు శుక్ర‌వారం (మార్చి 11) స్టేడియం వ‌ద్ద అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు టికెట్లు విక్రయిస్తామని ప్రకటించింది. వీకెండ్ కావడంతో ఫాన్స్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. 


ఇప్పటివరకూ మూడు డేనైట్‌ టెస్టులాడిన భారత్‌.. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచులో ఓడింది. బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో గులాబి బంతుల ఫార్మాట్లో మంచి ఆరంభం చేసిన భారత్.. ఆస్ట్రేలియాపై మాత్రం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక చివరగా ఇంగ్లండ్ జట్టుతో ఆడి మరో విజయాన్ని అందుకుంది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న భారత్.. సొంతగడ్డపై శ్రీలంకను చిత్తుచేయడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇక ఈ మ్యాచులో అయినా విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!


Also Read: Jofra Archer: ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ముందే తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook