Ind Vs SL 3rd Odi Highlights: టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకను భారీ తేడాతో ఓడించింది. తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లి (166), శుభ్‌మన్ గిల్ (116) సెంచరీలతో దుమ్ములేపారు. అనంతరం భారత బౌలర్ల చెలరేగడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు ఒకరి తర్వాత పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో 22 ఓవర్లలో 73 పరుగుల స్వల్ప స్కోరుకే కుప్పకూలడంతో 317 పరుగుల భారీ తేడాతో చారిత్రత్మాక విజయాన్ని సాధించింది.  మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడా టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 15.2 ఓవర్లలో 95 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ (42) ఔట్ అయిన తరువాత.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ శ్రీలంక బౌలర్లను ఆడుకున్నారు.  
గిల్ (97 బంతుల్లో 116 పరుగులు) కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. 


రన్‌ మెషీన్ కోహ్లీ 110 బంతుల్లోనే 166 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఇందులో 8 సిక్సర్లు, 14 ఫోర్లు బాదడం విశేషం. కెరీర్‌లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్ (38) రాణించాడు. కేఎల్ రాహుల్ (7), సూర్యకుమార్ యాదవ్ (4) భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యారు. చివర్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది.


391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మహ్మద్ సిరాజ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడంతో శ్రీలంక కోలుకోలేకపోయింది. శ్రీలంక తరఫున ఓపెనర్ నువానీదు ఫెర్నాండో అత్యధికంగా 19 పరుగులు చేశాడు. కెప్టెన్ దసున్ షనక (11), కసున్ రజిత (13) ఆ తరువాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు. 


మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం సింగిలి డిజిట్‌కే పరిమితమిమయ్యారు. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 73 శ్రీలంక ఆలౌట్ అయింది. సిరాజ్ 10 ఓవర్లలో 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఒక రనౌట్ కూడా చేశాడు. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో 317 పరుగుల తేడా భారత్ గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ విరాట్ కోహ్లీకే దక్కాయి. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2008లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి