IND vs SL 3rd T20I Predicted Playing XI: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో సిరీస్‌ విజేతను తేల్చే మూడో టీ20 గెలిచి ట్రోఫీ గెలుచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మంచి పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో తన టీ20 అరంగేట్రం చేసాడు. అయితే గిల్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 7, రెండో మ్యాచ్‌లో 5 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad).. గిల్ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో రుతురాజ్‌ 5 మ్యాచ్‌లలో 660 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ ఉంది.


కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. రెండో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఆడేందుకు హర్షల్ పటేల్‌ను తప్పించారు. రెండో టీ20లో చెత్త బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో ముఖేష్ కుమార్‌ (Mukesh Kumar) టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్ మావిలు పేస్ కోటాలో కోసాగానున్నారు. ఆకట్టుకొని మణికట్టు స్పిన్నర్‌ యజేంద్ర చహల్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.


భారత్ తుది జట్టు (అంచనా): 
ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్ యాదవ్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌, ముఖేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌. 


Also Read: Rahu Transit 2023: మీన రాశిలోకి రాహువు.. ఈ 4 రాశుల వారి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బు సంచులు ఖాయం!  


Also Read: TS Sankranti 2023 Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు 5, కాలేజీలకు 3రోజుల సెలవులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.