IND Vs SL Asia Cup 2023: ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు.. నిప్పులు చెరిగిన సిరాజ్.. తోకమూడిచిన శ్రీలంక బ్యాట్స్‌మెన్
Mohammed Siraj Takes 5 Wickets: మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఒకే ఓవర్లలో నాలుగు వికెట్లు తీయగా.. కేవలం ఐదు పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
Mohammed Siraj Takes 5 Wickets: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు టీమిండియా చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఒకే ఓవర్లు నాలుగు వికెట్లు తీసి.. శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు సహరిస్తుండడంతో భారీ స్కోరు చేద్దామని శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లోకి వచ్చారు. అయితే మొదటి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేశాడు.
ఇక ఆ తరువాత సిరాజ్ షో మొదలైంది. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన సిరాజ్.. ఒక్క పరుగు ఇవ్వకుండా మిడిన్ ఓవర్ వేశాడు. తరువాతి ఓవర్‌లో బుమ్రా కూడా ఒక పరుగే ఇవ్వడంతో మూడు ఓవర్లలో 8 పరుగులు చేసింది శ్రీలంక. నాలుగో ఓవర్‌లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. తొలి బంతికి పాతుమ్ నిస్సంక (2)ను ఔట్ చేయగా.. మూడో బంతికి సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ చేశాడు. నాలుగో బంతికి అసలంక (0)ను పెవిలియన్‌కు పంపించాడు. ఐదో బంతికి వచ్చి రాగానే బౌండరీ బాదిన ధనంజుయ డిసిల్వా.. చివరి బంతికి కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో శ్రీలంకను కోలుకోలేని స్థితికి చేరుకుంది.
ఐదో ఓవర్‌ను బుమ్రా మిడిన్ వేయడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. పుండు మీద కారం చల్లినట్లు కెప్టెన్ దసున్ షనక (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 12 పరుగుల వద్దే ఆరో వికెట్ కోల్పోగా.. ఆరు ఓవర్లలో 13 పరుగులు చేసింది. సిరాజ్ 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ఎందుకు బ్యాటింగ్ తీసుకున్నామా..? అని శ్రీలంక బాధపడేట్లు చేశాడు.
ఇక టీమిండియా బౌలర్లు తరువాత కూడా అదే జోరును కంటిన్యూ చేశారు. కాసేపు క్రీజ్‌లో కుదురుకున్న కుశాల్ మెండిస్ (17)ను కూడా మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత మూడు వికెట్లను హార్థిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు డకౌట్ అయ్యారు. ఇద్దరు మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సిరాజ్ 6, పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ తీశారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.
Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook