IND vs SL Dream11 Team Tips: రెండో వన్డేకు రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ఆ ప్లేయర్ రంగంలోకి.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..!
India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: తొలి వన్డేలో గట్టిపోటినిచ్చిన శ్రీలంక.. సొంతగడ్డపై బలంగా మారింది. టీ20 సిరీస్ కోల్పోయిన లంకేయులు.. వన్డే సిరీస్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. భారత్ కూడా చివరి రెండు వన్డేల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. నేడు జరిగే రెండో వన్డేకు డ్రీమ్11 టిప్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 వివరాలు మీ కోసం..
India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: శ్రీలంకతో నేడు రెండో వన్డేలో టీమిండియా తలపడనుంది. మొదటి వన్డే టైగా ముగియడంతో మిగిలిన రెండు వన్డేలను గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. సొంతగడ్డపై ఎట్టిపరిస్థితుల్లోనూ వన్డే సిరీస్ అప్పగించకూడదని శ్రీలంక బరిలోకి దిగుతోంది. రోహిత్ సేన ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. తొలి వన్డేలో శ్రీలంక పోరాటం తరువాత టఫ్ ఫైట్‌గా ఉండనుంది. రెండో వన్డేలో భారత జట్టు ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గిల్ స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ స్థానంలో పరీక్షించే అవకాశం ఉంది. గిల్ తొలి వన్డేలో 35 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఫామ్‌లో ఉన్న పంత్‌కు ఛాన్స్ దక్కొచ్చు. ఆల్‌రౌండర్‌గా రియాన్ పరాగ్‌ను కూడా ఆడించే అవకాశాన్ని హిట్‌మ్యాన్ పరిశీలించే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Cheap and Best Hatchback Car: SUV డిజైన్‌తో బెస్ట్ Hatchback కారు, ధర కూడా తక్కువే
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
==> మొత్తం మ్యాచ్‌లు: 169
==> భారత్ విజయాలు: 99
==> శ్రీలంక విజయాలు: 57
==> ఫలితం లేదు: 11
==> టై: 1
పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని పిచ్ నెమ్మదిగా ఉంటుంది. పొడి స్వభావం కారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టుకోవచ్చు. అయితే ఫాస్ట్ బౌలర్లను ఆరంభంలో ఆచితూచి ఎదుర్కొవాలి. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. రెండు జట్లకు కూడా మిడిల్ ఓవర్లు కీలకంగా మారనున్నాయి.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/ రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా , జనిత్ లియానాగే, మహమ్మద్ షిరాజ్, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో.
IND Vs SL Dream11 Team Tips:
వికెట్ కీపర్: రిషబ్ పంత్
బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, వనిండి హసరంగా
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, మహేశ్ తీక్షణ, మహ్మద్ సిరాజ్ (వైస్ కెప్టెన్), కమిందు మెండిస్
Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.