Lahiru Kumara's Bouncer hits Ishan Kishan Head during 2nd T20I: భారత జట్టుకు శ్రీలంక టీ20 సిరీస్ కలిసిరానట్టుంది. ఆరంభానికి ముందే పలువురు ప్లేయర్స్ గాయాల బారిన పడగా.. సిరీస్ ఆరంభం అయ్యాక కూడా అది కొనసాగుతోంది. సిరీస్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు గాయాలు కాగా.. తొలి టి20 తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్ కూడా గాయపడ్డాడు. తాజాగా ఆ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్‌ కిషన్‌ కూడా చేరిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధర్మశాలలో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ ఓ రాకాసి బౌన్సర్‌‌కు గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార వేశాడు. ఆ ఓవర్‌లోని రెండో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో లహిరు వేయగా.. ఇషాన్ పుల్ షాట్‌‌‌‌ ఆడాడు. కానీ బ్యాట్ అడ్వాన్స్ అవ్వడంతో.. బంతి ఇషాన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తగిలిన తర్వాత ఇషాన్ కాసేపు మైదానంలో కూర్చుండిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి ఇషాన్‌ను పరిశీలించాడు.


గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఇషాన్ కిషన్ మ్యాచ్ కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. లహిరు కుమార వేసిన మరుసటి ఓవర్‌లోనే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్ ఈ మ్యాచులో 15 బంతుల్లో 16 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ గాయం ఎఫెక్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత చూపింది. అర్థరాత్రి ఇషాన్ కొంత అస్వస్థతకు గురవ్వడంతో.. బీసీసీఐ మెడికల్ బృందం అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. 


బీసీసీఐ ఇషాన్‌ కిషన్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. తలకు బలమైన గాయం తగిలిందా? లేదా? మాములు దెబ్బేనా అన్న కోణంలో స్కాన్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులు ఈరోజు (ఫిబ్రవరి 27) రానున్నాయి. అయితే ప్రస్తుతం ఇషాన్‌ బాగానే ఉ‍న్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని కంగ్రా ఆసుపత్రి డాక్టర్‌ చెప్పారు.


Also Read: Hyderabad Blast: హైదరాబాద్‌ శివారులో పేలుడు.. మహిళ మృతి!


Also Raed: Amazon Offers: ఆ షియోమీ మొబైల్‌పై 7 వేల ఆఫర్.. ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా! మరికొద్ది గంటలు మాత్రమే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook