IND vs SL: టీమిండియా ఓటమిపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. అది బౌలర్ చేతుల్లోనే ఉంటుంది
Sunil Gavaskar On IND vs SL 2ND T20: శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా బౌలర్లకు ఆయన క్లాస్ పీకారు. టీమిండియా 7 నో బాల్స్ వేయడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏకంగా 22 రాబట్టిన సంగతి తెలిసిందే.
Sunil Gavaskar On IND vs SL 2ND T20: పుణె వేదికగా జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి బౌలర్లు ప్రధాన కారణమయ్యారు. ముఖ్యంగా నో బాల్స్ టీమిండియా కొంపముంచాయి. ఈ నోబాల్స్ పడకపోతే ఫలితం మరోలా ఉండేదేమో. ఈ నో బాల్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏకంగా 22 పరుగులు రాబట్టుకున్నారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా ఐదు నోబాల్స్ వేసి చెత్త రికార్డు ముటగట్టున్నాడు. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి కూడా చెరో నో బాల్ వేశారు.
టీమిండియా ఓటమిపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. పేలవమైన బౌలింగ్ తీరుపై మండిపడ్డారు. “ప్రొఫెషనల్ ప్లేయర్లు ఇలా నోబాల్స్ వేయడం మంచి పద్ధతి కాదు. ప్రస్తుత ఆటగాళ్లందరూ పరిస్థితులు మన చేతుల్లో ఉండవని అంటున్నారు. అవును పరిస్థితులు ఉండవు. కానీ నో బాల్ వేయకుండా చూసుకోవచ్చు. బంతి విసిరిన తరువాత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తాడనే విషయం పక్కన పెడితే.. ముందు నో బాల్ వేయకుండా ఉండాలి. నో బాల్ వేయకుండా బౌలర్ కచ్చితంగా నియంత్రించుకోవచ్చు..” అని టీమిండియా బౌలర్లకు చురకలు అంటించారు.
ప్రెజెంటేషన్ వేడుకలో భారత బౌలర్ల బౌలింగ్‌పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తిగా కనిపించాడు. ఏ బౌలర్‌పై ఆరోపణలు చేయకుండా.. ఏ ఫార్మాట్‌లో అయినా నో బాల్స్‌తో మూల్యం చెల్లించుకోవాల్సిందేన్నాడు. తాము కొన్ని ప్రాథమిక తప్పులు చేశామన్నాడు. మనం నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టడమే మనకు పాఠం అని అన్నాడు. ఒక రోజు మనకు చెడుగా జరగొచ్చని.. మరో రోజు మంచిగా ఉన్నా బేసిక్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలన్నాడు.
భారత ఓటమికి అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రధాన కారణంగా నిలిచాడు. 2 ఓవర్లలో 5 నో బాల్స్‌తో 37 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. టీ20 క్రికెట్‌లో భారత్ నుంచి అత్యధిక నో బాల్‌లు వేసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా 3 నో బాల్స్ వేసిన మొదటి టీమిండియా బౌలర్‌గా కూడా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ పోరాడినా ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈ నెల 7న జరగనుంది.
Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా
Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook