India Vs West Indies 1st Odi Toss and Playing 11: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కరేబియన్ జట్టుతో రోహిత్ సేన నేడు తొలి వన్డే ఆడనుంది. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. అదే ఊపులో వన్డే సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. అటు వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అర్హత కోల్పోయిన విండీస్.. టీమిండియాకు ఎంత వరకు పోటీనిస్తుందో చూడాలి. గురవారం బార్బడోస్ వేదికగా రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముంందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ను తీసుకోగా.. సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ముఖేష్‌ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ‌


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేము ముందుగా ఫీల్డింగ్ చేయబోతున్నాం. బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం లేదు. అన్ని విషయాలను పరీక్షించాలని అనుకుంటున్నాం. స్పష్టమైన ఆలోచనతో ప్రపంచకప్‌లోకి వెళ్లాలనుకుంటున్నాం. మాకు ఫలితాలు కూడా ముఖ్యమే. వేర్వేరు ఆటగాళ్లను ప్రయత్నించబోతున్నాము. జట్టులో నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నాం.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


"ప్రతి సిరీస్, ప్రతి గేమ్ చాలా ముఖ్యం. మేము మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము. మా దగ్గర కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. మేము కొంతమంది నాణ్యమైన స్పిన్నర్లను కూడా పొందాము, సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడమే లక్ష్యం. మా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం.. చివరిసారిగా కొన్ని అవకాశాలను మిస్ చేసుకున్నాం. ఫీల్డ్‌లో మరింత యాక్టివ్‌గా ఉండాల్సి ఉంది. ఈ పిచ్‌పై మంచి స్కోరును ఉంచడానికి ప్రయత్నిస్తాము.." అని విండీస్ కెప్టెన్ షై హోప్ చెప్పాడు.


తుది జట్లు ఇలా..


భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్


వెస్టిండీస్: షై హోప్ (వికెట్ కీపర్, కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హిట్‌మేయర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ.


Also Read: Bhola Shankar Trailer: భోళా శంకర్ ట్రైలర్ విడుదల.. రామ్‌చరణ్ బాబులా చేశాడు


Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook