Virat Kohli got out 18 runs in 100th IDI at Home: టీమిండియా రన్ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. రికార్డుల రారాజు సెంచరీ చేయక ఇప్పటికీ రెండేళ్లకు పైగా అయింది. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన కెరీర్ రికార్డు ఉన్న విరాట్ అడపాదడపా హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. కోహ్లీ సెంచరీ చేయకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్‌ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో విండీస్‌తో జరుగుతున్న వన్డేలలో అయినా శతకం అందుకుంటాడేమో అనుకుంటే.. అదికూడా జరగట్లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డేలో 4 బంతుల్లో 8 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. రెండో వన్డేలో కూడా విఫలమయ్యాడు. స్వదేశంలో వందో వన్డే ఆడుతున్న కోహ్లీ నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. స్పెషల్ మ్యాచులోనూ 30 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్ ఓడెన్‌ స్మిత్‌ వేసిన 12వ ఓవర్ ఆఖరి బంతికి ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు.


స్పెషల్ మ్యాచులోనూ విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన చేయడంతో అతడి ఫాన్స్ నిరాశకు గురయ్యారు. 'స్పెషల్ మ్యాచులోనూ విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సెంచరీ ఇక కలనేనా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై శతకం బాదాడు. కోల్‌కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్ట్‌లో (136) శతకం బాదాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీ చేయలేదు. 2008 నుంచి 2019 వరకు కోహ్లీ ప్రతీ ఏడాది కనీసం ఒక్క సెంచరైనా బాదాడు. కానీ 2020, 2021లో మూడు ఫార్మాట్లో కలిపి ఒక్క శతకం బాదలేకపోయాడు. అందుకే అతడి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వ‌న్డే విరాట్ కోహ్లీకి స్వ‌దేశంలో 100వ మ్యాచ్. 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో స్వ‌దేశంలో100 మ్యాచ్ పూర్తి చేసుకున్న ఐదో భార‌త ప్లేయ‌ర్‌గా విరాట్ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ (164 మ్యాచ్‌లు), ఎంఎస్ ధోనీ (127 మ్యాచ్‌లు), మొహమ్మద్ అజ‌హ‌రుద్దీన్ (113 మ్యాచ్‌లు), యువ‌రాజ్ సింగ్ (108 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ స్వదేశంలో 100 వ‌న్డేల్లో 5200 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Also Read: Kajal Aggarwal Body Shaming: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇదంతా మామూలే.. బాడీ షేమింగ్‌ చేసే వారికి కాజల్‌ కౌంటర్!


Also Read: Thaman Copy Tunes Issue: భీమ్లా నాయక్‌లో కాపీ ట్యూన్స్‌, థమన్‌పై కాపీ రైట్స్‌ ఇష్యూ లేవనెత్తుతోన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook