India post 187 target to West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసి.. విండీస్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ.. ఈ మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చాడు. విరాట్ 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇక యువ వికెట్ కీపర్ రిషబ్​ పంత్ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారీ స్కోరే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (2) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ (52: 41 బంతుల్లో 7×4, 1×6)తో కలిసి కెప్టెన్‌ రోహిత్ శర్మ (18) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇద్దరు క్రీజులో కుదురుకోవడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ 49 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. 


ఎనిమిదో ఓవర్లో బ్రెండన్‌ కింగ్‌కి చిక్కి రోహిత్ శర్మ పెవిలియన్‌ చేరాడు. కొద్దిసేపటికే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (8) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిరాశపరిచాడు. దాంతో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయితే అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాసేపటికే విరాట్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (52: 28 బంతుల్లో 7×4, 1×6), వెంకటేశ్ అయ్యర్‌ (33: 18 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా ఆడారు. 


రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్‌ బౌండరీల వర్షం కురిపించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే పంత్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. ఓ బంతి ఆడిన హర్షల్ పటేల్ ఒక పరుగు చేశాడు. చివరకి భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ మూడు.. షెల్డన్‌ కాట్రెల్‌, రొమారియో షెఫర్డ్‌ తలో వికెట్ పడగొట్టారు.


Also Read: Sunny Leone PAN Card: అయ్యో హతవిది.. గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయిన సన్నీ లియోన్‌!!


Also Read: Anasuya Bharadwaj: హలో.. నా వయసు 40 కాదు 36 మాత్రమే! జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook