India vs West Indies, 2nd Test Day 1 Highlights: పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా గురువారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. ఇది రెండు జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టు మ్యాచ్ కావడంతో ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలి టెస్టులో గెలిచిన భారత్ అదే ఊపును చివరి టెస్టులోనూ కొనసాగిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 87 పరుగులతో, రవీంద్ర జడేజా 36 పరుగులతోనూ ఆడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దూకుడుగా జైస్వాల్.. నిలకడగా రోహిత్..
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా జైస్వాల్‌ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు హిట్ మ్యాన్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. భారత ఓపెనర్లపై తొలి సెషన్లో విండీస్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు రోహిత్ సిక్స్ తో 74 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి  121/0తో నిలిచింది. లంచ్‌ తర్వాత కరేబియన్ బౌలర్లు పుంజుకున్నారు. రెండో సెషన్‌లో భారత్ 61 పరుగులే చేసి 4  వికెట్లు కోల్పోయింది. రోహిత్ 80, జైస్వాల్ 57 పరుగులు చేసి ఔటయ్యారు. శుభ్‌మన్‌ గిల్ (10), అజింక్య రహానె (8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 


ఆదుకున్న కింగ్ కోహ్లీ..
కష్టాల్లో పడిన టీమిండియాన్ కింగ్ కోహ్లీ అదుకున్న్నాడు. జడేజా కూడా ఇతడికి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలైనప్పుడల్లా బౌండరీలను కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలోనే కోహ్లీ టెస్టుల్లో 30వ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత నిలకడ ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. రెండో రోజు కూడా కోహ్లీ,  జడేజా ఇదే విధంగా ఆడితో టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం.


Also Read: Pakistan Vs Srilanka: బాల్ కోసం బ్యాట్స్ మన్ - కీపర్ కీచులాట.. శ్రీలంక- పాకిస్థాన్ సీరిస్ లో ఆసక్తికర ఫటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook