India Vs West Indies Dream11 Team Tips and Playing 11: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సమం చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. నేడు కరేబియన్ జట్టుతో నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించగా.. మూడో మ్యాచ్‌లో గెలుపొందింది. ఆతిథ్య జట్టు సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లలో ఎలాంటి మార్పులు చేయనున్నాయి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? డ్రీమ్ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ మైదానంలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గతంలో 200 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించాయి. అయితే ఎక్కువసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఛేజింగ్ చేసిన జట్ల విజయ శాతం 25 మాత్రమే. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 180 పరుగులుగా ఉంది. మ్యాచ్‌ మధ్యలో స్పిన్నర్లు కీరోల్ ప్లే చేస్తారు. చివర్లో పిచ్‌ నుంచి పేసర్లకు సహాకారం అందుతుంది. ఈ స్టేడియంలో విండీస్‌తో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. 


ఈ మ్యాచ్‌కు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం ఇవ్వనుండగా.. ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమవుతాడు. పేస్ బౌలింగ్‌ విభాగంలో ముఖేష్ కుమార్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక గాయం కారణంగా మూడో మ్యాచ్‌కు దూరమైన విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఈ మ్యాచ్‌లో ఆడే సూచనలు ఉన్నాయి.


వేదిక: ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ మైదానం
సమయం: రాత్రి 8 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ 


వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్/రోస్టన్ ఛేజ్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


డ్రీమ్ 11 టీమ్ టిప్స్..


వికెట్ కీపర్లు: నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్)


బ్యాట్స్‌మెన్లు: రోవ్‌మాన్ పావెల్, బ్రాండన్ కింగ్, జైస్వాల్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ


ఆల్‌రౌండర్లు: హార్ధిక్ పాండ్యా


బౌలర్లు: కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, షెపర్డ్, జోసఫ్‌