India Vs West Indies Today Match Dream11 Team Prediction: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు జోరుకు బ్రేకులు వేసిన టీమిండియా.. సిరీస్‌ విజయంపై కన్నేసింది. శనివారం జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమమైంది. మొదటి రెండు మ్యాచ్‌లను వెస్టిండీస్ గెలుపొందగా.. తరువాత రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌ ఆదివారం జరుగుతోంది. నాలుగో టీ20 జరిగిన ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగానే ఐదో మ్యాచ్ కూడా జరుగుతోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే.. సిరీస్‌ వారి సొంతమవుతుంది. కీలక పోరుకు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. పిచ్ రిపోర్టు, స్ట్రీమింగ్ వివరాలు, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 పిచ్ రిపోర్ట్ ఇలా..


సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. నాలుగో టీ20లో రెండు జట్లలో బ్యాట్స్‌మెన్ ఈజీగా పరుగులు సాధించారు. ఈ పిచ్‌పై ఛేజింగ్‌ రికార్డు అంతగొప్పగా లేకపోయినా.. శనివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు చెలరేగి ఆడారు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 180 పరుగులుగా ఉంది. మ్యాచ్‌ మధ్యలో స్పిన్నర్లు, చివర్లో పేసర్లు ప్రభావం చూపిస్తారు. టాస్ గెలిచిన జట్టు మరోసారి బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 


వేదిక: ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ మైదానం
సమయం: రాత్రి 8 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ 


వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, ఒబెడ్ మెక్‌కాయ్


డ్రీమ్ 11 టీమ్ ఇలా..


వికెట్ కీపర్లు: నికోలస్ పూరన్


బ్యాట్స్‌మెన్లు: రోవ్‌మాన్ పావెల్, షై హోప్, జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), తిలక్ వర్మ


ఆల్‌రౌండర్లు: హార్ధిక్ పాండ్యా, జేసన్ హోల్డర్


బౌలర్లు: కుల్దీప్ యాదవ్ (వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, షెపర్డ్