Ind VS WI Day 2 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా ఏకపక్ష విజయం వైపు దూసుకువెళుతోంది.  ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శతకాలతో చెలరేగడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళుతోంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు యువ బ్యాట్స్‌మెన్ జైస్వాల్. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరో 45 పరుగులు చేస్తే టీమింండియా‌ తరఫున ఆడిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తాడు. 57 రన్స్ జోడిస్తే.. టీమిండియా క్రికెట్‌ చరిత్రలో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్న యశస్వి జైస్వాల్.. మైదానంలో సహనం కోల్పోయి నోటికి పనిచెప్పాడు. తనకు అడ్డుగా వచ్చిన వెస్టిండీస్ బౌలర్‌పై బూతులతో విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పేసర్ కెమర్ రోచ్‌పై రాయలేని భాషలో బూతు పదజాలం ఉపయోగించాడు. నాకు అడ్డు రాకు లం**' అని అర్థం వచ్చేలా హిందీలో తిట్టాడు. ఈలోపు యశస్వి అరుపు విన్న కోహ్లీ.. ఏమైందని అడిగాడు. పరిగెత్తకుండా తనకు అడ్డంగా వస్తున్నాడని జైస్వాల్ చెప్పాడు. ఎవరు కెమర్ రోచా..? అంటూ కోహ్లీ అడిగాడు. హా.. అవును యశస్వి బదులిచ్చాడు. ఈ మాటలు మొత్తం స్టంప్స్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఇన్నింగ్స్ 103వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది.


 




ప్రస్తుతం జైస్వాల్ (143), విరాట్ కోహ్లీ (36) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్  2 వికెట్లు కోల్పోయి 312 రన్స్ చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(103) సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. శుభ్‌మన్ గిల్(6) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ పడగొట్టారు.


Also Read: Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు  


Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి