WT20 WC 2023: టీ20 ప్రపంచకప్‌లో భారత్ జోరు.. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం!
India Women won by 6 wkts vs West Indies in Womens T20 World Cup 2023. మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని చిత్తు చేసింది.
Deepti Sharma help India beat West Indies in Womens T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత మహిళలు.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని చిత్తు చేసింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్ సేన 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33; 42 బంతుల్లో 3 ఫోర్లు), బ్యాటర్ రిచా ఘోష్ (44; 32 బంతుల్లో 5 ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రెండు వికెట్లు పడగొట్టింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ స్మృతి మంధాన (10) త్వరగానే ఔట్ అయింది. ఆ వెంటనే స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (1) నిరాశపరిచింది. కాసేపటికే ఫాలీ వర్మ (28; 23 బంతుల్లో 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరింది. ఈ సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. టీమిండియాను లక్ష్యం వైపు తీసుకెళ్లారు. చివర్లో హర్మన్‌ప్రీత్ ఔట్ అయినా.. రిచా మిగతా లాంఛనాన్ని పూర్తిచేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టాఫానీ టేలర్ (42; 40 బంతుల్లో 6 ఫోర్లు), షెమైన్ (30; 36 బంతుల్లో 3 ఫోర్లు) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. చెదియన్ (21), షబికా (15) పరుగులు చేశారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2), హెన్రీ (2), ఫ్లెచర్ (0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు పడగొట్టింది. దీప్తి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.
వెస్టిండీస్‌పై మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టింది. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా దీప్తి రికార్డులో నిలిచింది. దీప్తి 89 టీ20ల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకుంది. వెటరన్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచ్‌ల్లో 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో సీనియర్ వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ (117 మ్యాచ్‌లు, 125 వికెట్లు) తొలి స్థానంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.