IND vs ZIM: ఆఖరి వన్డేలో చెమటోడ్చి గెలిచిన టీమిండియా..సిరీస్ క్లీన్‌స్వీప్..!
IND vs ZIM: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివర వన్డేలో 13 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.
IND vs ZIM: హరారే వేదికగా జరిగిన ఆఖరి మూడో వన్డేలో భారత్ చెమటోడ్చి గెలిచింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఐనా జట్టుకు గెలిపించలేకపోయాడు. ఇటు శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో భారత్ మొదట భారీ స్కోర్‌ను చేసింది. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
శుభ్‌మన్ గిల్ 130, ఇషాన్ కిషన్ 50 పరుగులు చేశారు. ధానవ్ 40, కేఎల్ రాహల్ 30 పరుగులతో పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లో ఈవెన్స్ 5 వికెట్లు తీశాడు. జాగ్వే , న్యాయుచి తలో వికెట్ తీశారు. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సికిందర్ రజా 115 పరుగులతో భారత్‌కు చెమటలు పట్టించాడు. విలియమ్స్ 45, ఈవెన్స్ 28 పరుగులు చేశారు. ఆవేష్ ఖాన్ 3, కుల్దీప్, అక్షర్‌పటేల్, దీపక్ చాహర్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఈమ్యాచ్ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇటు ఐర్లాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను సాధించింది. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించింది భారత్.
Also read:Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారుతున్నారా..సోనియా గాంధీకి ఘాటు లేఖ..!
Also read:CM Kcr: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర..మౌనం వహించొద్దన్న సీఎం కేసీఆర్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి