ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడిన టీమిండియా తమ ప్రత్యర్థి జట్టుకు 286 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మొదట టాస్ గెలిచిన హాంగ్ కాంగ్ కెప్టేన్ అన్షుమన్ రత్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ కి దిగింది. మొదట ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లలో రోహిత్ శర్మ 22 బంతుల్లో 23 పరుగులు (4X4) చేసి ఔట్ కాగా ధవన్ మాత్రం అంబటి రాయుడు సహకారంతో 120 బంతుల్లో 127 పరుగులు (4X15, 6X2)తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంబటి రాయుడు 70 బంతుల్లో 60 పరుగులు(4X3, 6X2) చేసి మరో అర్ధ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దినేశ్ కార్తిక్ 38 బంతుల్లో 33 పరుగులు చేసి రానించే ప్రయత్నం చేయగా మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 


మొత్తంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి హాంగ్ కాంగ్‌కి 286 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.