చివరి వరకు తీవ్ర ఉత్కంఠ.. ఆఖరికి అప్గాన్‌పై గెలిచిన భారత్
ప్రపంచ కప్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా అప్గానిస్తాన్‌తో జరిగిన 28వ మ్యాచ్‌లో ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సౌతాంప్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా అప్గానిస్తాన్‌తో జరిగిన 28వ మ్యాచ్‌లో ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేసింది విరాట్ కోహ్లి 63 బంతుల్లో 67 పరుగులు, కేదార్ జాదవ్ 68 బంతుల్లో 52 పరుగులు రాణించడంతో టీమిండియా ఆ మాత్రమైనా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 30 పరుగులు, విజయ్ శంకర్ 41 బంతుల్లో 29 పరుగులు, ఎంఎస్ ధోని 52 బంతుల్లో 28 పరుగులు రాబట్టారు.
అనంతరం 225 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన అప్గానిస్తాన్ 213కే ఆలౌట్ అయింది. మొహమ్మద్ నబి 55 బంతుల్లో 52 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. మహ్మద్ షమి అతడి వికెట్ తీసి అఫ్గాన్ విజయానికి అడ్డుకట్ట వేశాడు. చివరి వరకు ఉత్కంఠరేపుతూ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో మహ్మద్ షమి తన బంతులతో మాయ చేశాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు వికెట్లు తీసి అప్గాన్ నడ్డి విరిచిన షమి.. ప్రత్యర్థి విజయావకాశాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జస్ప్రిత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.