ఈడెన్ గార్డెన్స్ లో చెలరేగిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్
IND Vs NZ 3rd T20 2021: కలకత్తా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో 73 పరుగులు తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
IND Vs NZ 3rd T20 2021: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో నెగ్గి మూడు మ్యాచుల సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ 73 పరుగుల తేడాతో రోహిత్ సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. విజయంలో రోహిత్‌శర్మ(56) హాఫ్ సెంచరీ, బౌలర్ అక్సర్ పటేల్ 3 వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించారు.
185 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (51) అర్ధ శతకం సాధించినా.. మిగిలిన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. మిగతా కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (17), ఫెర్గూసన్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/9) అదరగొట్టేశాడు. హర్షల్ పటేల్ (2/24), చాహల్ (1/26), వెంకటేశ్ అయ్యర్ (1/12), దీపక్ చాహర్ (1/26) రాణించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56) ఈ సిరీస్‌లో వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (29) ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (69) భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఇషాన్ తోపాటు సూర్యకుమార్ (0), రిషభ్ పంత్ (4) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడం వల్ల స్కోరుబోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో(25) కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో 26వ అర్ధశతకం సాధించాడు.
రోహిత్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెంకటేశ్ అయ్యర్ (20) వేగంగా పరుగులు చేశాడు. అయితే శ్రేయస్, వెంకటేశ్ వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21*)ధాటిగా ఆడాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ తలో వికెట్ తీశారు.
Also Read: ఈడెన్ గార్డెన్స్ లో న్యూజిలాండ్ తో ఆఖరి టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
Also Read: వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించే యోచనలో బ్రిటన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook