India vs England: భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో టెస్టు నేడు జరగునుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా... మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా... గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌(India)దృష్టి పెట్టింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిడిలార్డరే పెద్ద సమస్య
మూడో టెస్టులో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ సేన ఎలా పుంజుకుంటుందన్నది అందరి ప్రశ్న. ఈ నేపథ్యంలో టీమ్ ఎంపికలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే పేలవ పామ్ లో ఉన్న వైస్ కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane)ను కొనసాగిస్తారా లేదా అతని స్థానంలో వేరొకరిని ఆడిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు జట్టులో అతి పెద్ద సమస్య కోహ్లి(Kohli), పుజారా(Pujara), రహానేలతో కూడిన మిడిల్‌ ఆర్డరే. అయితే రహానేను తప్పిస్తే ఆఫ్‌స్పిన్‌ కూడా వేయగల విహారి(Vihari)కే చోటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Also Read: Dale Steyn: ఆటకు గుడ్ బై చెప్పిన స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్...అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన


అశ్విన్‌ను ఆడిస్తారా!
సాధారణంగా ఓవల్(Oval) పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో గత మూడు టెస్టుల్లో అవకాశం దక్కని సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను ఓవల్‌లో ఆడిస్తారా చూడాలి. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌(Root) ఫామ్‌ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ అశ్విన్‌(Ashwin‌)ను ఆడిస్తే.. రూట్‌కు అతడికి మధ్య పోరు ఆసక్తి కలిగించనుంది. ఓవల్‌ మైదానంలో 13 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒకే మ్యాచ్‌(1971) నెగ్గింది. ఏడు మ్యాచ్‌లు డ్రా చేసుకుని, అయిదింట్లో ఓడింది.


వోక్స్‌కు అవకాశం...
సొంతగడ్డపై సిరీస్‌ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోరాదని అతిథ్యజట్టు పట్టుదలగా ఉంది. కెప్టెన్‌ రూట్‌ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ భీకర ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నాడు.  గత టెస్టులో చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌(England)కు బర్న్స్, హమీద్‌ రూపంలో ఓపెనింగ్‌ కలిసి రావడంతో పాటు పునరాగమనంలో మలాన్‌(Malan) కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా మారింది. వ్యక్తిగత కారణాలతో బట్లర్‌(Butler) ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో బెయిర్‌స్టో కీపింగ్‌ చేయనుండగా... ఒలీ పోప్‌ బ్యాట్స్‌మన్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా మొయిన్‌ అలీ(Moin Ali) కీలకం కానున్నాడు. ముగ్గురు పేసర్లు జోరులో ఉండగా ఒక కీలక మార్పు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌(Sam Karan) స్థానంలో మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌(Voks) బరిలోకి దిగుతాడు. 


Also Read: Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మల కోచ్ కన్నుమూత...సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook