దాదాపు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను విడిచిపెట్టుకొని.. విజయాన్ని దూరం చేసుకున్న భారత యువ హాకీ జట్టు.. తమకు పాజిటివ్‌గా మారబోతున్న ఆటను చేతులారా జాడవిడుచుకుంది. ఆజ్లాన్‌ షా హాకీ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించి అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. యువ భారత ఆటగాడు శీలానంద్‌ లర్కా 14వ నిమిషంలో చేసిన గోల్ తప్ప భారత్ ఈ గేమ్‌లో ఎలాంటి మెరుపులూ కురిపించలేదు. అయితే శీలానంద్ అతడి కెరీర్‌లో తొలి గోల్ చేయడంతో..‌. జట్టు కనీసం డ్రాతోనైనా సరిపెట్టుకుంది.


చిత్రమేంటంటే 53వ నిమిషంలో ఇంగ్లాండ్‌ ప్రేయర్ మార్క్‌ గ్లెగ్‌హార్న్‌ పెనాల్టీ కార్నర్‌ను బాగా ఉపయోగించుకొని మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించి భారత్ విజయావకాశాలకు గండి కొట్టాడు. ఈ డ్రాతో భారత్ ప్రస్తుతం ఈ టోర్నమెంటులో ఆరో స్థానంలో కొనసాగుతుంది. భారత్‌ మంగళవారం స్టార్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. 1983లో తొలిసారిగా ఆజ్లాన్‌ షా హాకీ టోర్నీ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఇప్పటికి 9 సార్లు ఈ టోర్ని గెలవగా.. భారత్ 4 సార్లు గెలుచుకుంది