India Vs Australia: రోహిత్ సెంచరీ వృధా : తొలి వన్డేలో కోహ్లీసేన ఓటమి
సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై 24 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది.
సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఉత్కంత పోరులో 34 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. రోహిత్ సెంచరీ (133) తో కదం తొక్కినప్పటికీ సపోర్ట్ ఇచ్చే వారు కరవయ్యారు. ఫలితంగా 288 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగల్గింది.
సమిష్ఠిగా రాణించిన ఆసీస్
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఓపెన్లరు అలెక్స్ క్రే 24 పరుగులు, ఫించ్ 06 స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అ తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖ్వాజా ( 59 పరుగులు) షార్స్ మార్ష్ ( 54 పరుగులు ) అర్థ సెంచరీలు చేసి జట్టుకు పటిష్ఠ పునాదులు వేశారు. ఆ తర్వాత వచ్చిన పీటర్ హాట్స్కకాంబ్ 73 పరుగులతో చేసి ఔట్ అవ్వగా మార్కస్ స్టోయినిస్ 47 చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. అనతనికి గ్రెన్ మాక్స్ వెల్ 11 పరుగులతో అండగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీయ 50 ఓవర్లు ఆసీస్ 288 పరుగులు చేసింది.
రోహిత్ ఓంటరి పోరు..
ఆసీస్ ఉంచిన 289 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా పరుగుల వేటలో చతికీలబడింది. తాజాగా వన్డే జట్టులో వచ్చి చేరిన ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ గా వెనుదిగిగాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం సెంచరీ (133)తో కదం తొక్కి చక్కటి పోరాటపటిమ కనబర్చాడు. అయితే అతనికి సపోర్ట్ ఇచ్చే వారు కరవయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు డకౌట్ అయి నిరాశపర్చాడు. అయితే ధోనీ (51) అర్థ సెంచరీ చేసి రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే జాన్సస్ బెర్హన్ డార్ఫ్ వేసిన బంతికి ధోనీని బోల్తా పడ్డారు.
ఇదే మ్యాచ్ టర్నింగ్
ధోనీ ఔట్ తో మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ తర్వాత వచ్చిన దినేష్ 12 , రవీంద్ర జడేజా 08 పరుగులకే, షమీ 1, కుల్తీప్ 3 పరుగులు చేసి వెనువెంటనే ఔట్ అయ్యారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ (133) ఔట్ అయ్యాడు. చివర్లో భువనేశ్వర్ (29 నాటౌట్ ) చెలరేగినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యాయి. ఫలితంగా తొలి వన్డే లో టీమిండియాపై ఆసీస్ గెలుపు సాధించింది. రిచర్డ్ సన్ 4 కీలమైన నాలుగు వికెట్ల తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా..జాన్సస్ బెర్హన్ డార్ఫ్, మార్కస్ చెరో 2 వికెట్లు తీసి విజయంలో వంతు పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా తాజా ఓటమితో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 0-1 తేడాతో వెనుకంజలో ఉంది.