భారత్- కివీస్ మ్యాచ్ రద్దుతో...ఎవరికి నష్టం..ఎవరికి లాభం ?
భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దువడంతో ఎవరికి ఎంత లాభం ఎవరికి ఎంత నష్టం అని ఇరు జట్టు బేరీజు వేసుకుంటున్నాయి.
వరల్డ్ కప్ మ్యాచులను చూసి ఆస్వాధించాలంటుకున్న అభిమానులకు వరణుడి రూపంలో కొంత నిరాశ ఎదురౌతోంది. ఇప్పటి వరకు వర్షం కారణంగా మూడు లీగ్ మ్యాచ్ లు రద్దయ్యాయి. తాజాగా భారత్- కివీస్ మ్యాచ్ రద్దుతో ఈ సంఖ్య నాల్గుకు చేరింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్- కివీస్ జట్లుకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా 7 పాయింట్లు సాధించిన కివీస్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ..భారత్ మరో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది. అయితే కివీస్‌కి ఇది నాల్గో మ్యాచ్ కాగా..భారత్ కు మూడో మ్యాచ్ మాత్రమే. తాజా పరిణామంలో ఎవరికి ఎంత లాభం ఎవరికి ఎంత నష్టం అని ఇరు జట్లు బేరీజు వేసుకుంటున్నాయి.
కివీస్ జట్టులో సంబరాలు..
వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దవడం..ఫలితం తేలకపోవడం వంటి పరిణామాలు భారత్ కు భారీ మొత్తంలో నష్టం ఏమీ జరగలేదు..అలాగని పెద్దగా వచ్చిన ప్రయోజనం కూడా ఏమీలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కివీస్ విషయానికి వస్తే... బలమైన ప్రత్యర్ధి భారత్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో హ్యాపీగా ఫీలౌతుంది. ఎందుకంటే తాజా పరిణామంతో ఒక పాయింట్ దక్కించుకున్న కివీస్... మొత్తం 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొసాగుతుంది. ఇక తన తదుపరి ఐదు మ్యాచుల్లో ఆ జట్టు కనీసం మూడు మ్యాచ్ లు గెలిచినా ఈజీగా సెమీస్ లో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే ఏమాత్రం అంచానాలు లేకుండా వచ్చిన కివీస్ జట్టు ఆనందానికి అవధులు ఉండవు కదా...
భారత్ కు కొంచెం ఇష్టం..కొంచెం కష్టం
ఇక భారత్ కూడా తదుపరి ఆరు మ్యాచుల్లో నాల్గు గెలిచినా ఈజీగా సెమీస్ కు చేరే అవకాశముంది. అయితే టీమిండియా ఫాంను బట్టి చూట్టు లీగ్ లోని అన్ని మ్యాచ్లుల్లో గెలిచి సెమీస్ కు చేరుతుందనే క్రీడావిశ్లేషకులు అంచనా వేశారు. అయితే కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటికే లీగ్ లో గట్టి జట్లయిన ఆసీస్, సౌతాఫ్రికాలను మట్టికరిపించినా భారత్ కు ఒక్క ఇంగ్లండ్ తప్పితే.. భారత్ ఎదుర్కొనే బలమైన జట్టు ఎవరికీ లేదు. పాక్ బరిలో ఉన్నప్పటికీ ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే ఆ జట్టుకు అంతగా సీన్ లేదని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.