India vs Sri Lanka 3rd T20I Playing 11: ఇటీవల టీ20 సిరీస్‌లో సొంతగడ్డపై పటిష్ట వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసిన భారత్.. శ్రీలంకపై కూడా సంపూర్ణ విజయం సాధించాలని చూస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచులను గెలుచుకున్న టీమిండియా.. నేడు నామమాత్రపు మ్యాచ్ అయిన చివరి టీ20 ఆడనుంది. ధర్మశాల వేదికగా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుండగా.. 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్.. మూడో టీ20లో బెంచ్ బలాన్ని పరీక్షించనుంది. మ్యాచ్ నేపథ్యంలో ఓసారి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టీ20లో ఓపెనర్ ఇషాన్ కిషన్ తలకు గాయమైన నేపథ్యంలో అతను చివరి మ్యాచులో బరిలోకి దిగడం దాదాపు ఆసాద్యమే. ఇషాన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆడనున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మయాంక్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయనున్నారు. ఈ ఇద్దరు రెండో టీ20లో చెలరేగిన విషయం తెలిసిందే. సంజూ  నుంచి మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది టీం మేనేజ్మెంట్. ఈ మ్యాచులో సంజూనే కీపింగ్ చేయనున్నాడు. 


ఐదు, ఆరో స్థానాల్లో వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా రానున్నారు. ఆపై స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా బరిలోకి దిగనున్నాడు. మ్యాచ్ గమనాన్ని బట్టి ఈ ముగ్గురి బ్యాటింగ్‌ ఆర్డర్ మారనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే.. అప్పుడు శార్దూల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో తెలుగు పేసర్ మహమ్మద్ సిరాజ్, ఢిల్లీ పేసర్ ఆవేశ్ ఖాన్ ఆడనున్నారు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చహల్‌‌కు బదులు యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ బరిలోకి దిగనున్నాడు. 


భారత్ తుది జట్టు (అంచనా): 
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా/శార్దూల్ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్.


Also Read: Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)


Also Read: Binura Fernando Catch: అచ్చు పక్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రీలంక ప్లేయర్ (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook