India Playing 11 vs New Zealand 1st ODI 2022: న్యూజిలాండ్ జట్టుపై టీ20 సిరీస్ కైవసం చేసుకొని జోరు మీదున్న భారత్ మరో సమరానికి సిద్దమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం ఉదయం 7 గంటలకు తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టును సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముందుండి నడిపించనున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో యువకులు బరిలోకి దిగనున్నారు. తొలి వన్డే మ్యాచ్‌ నేపథ్యంలో భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. టీ20 సిరీస్‌లో అవకాశం దక్కని సంజూ శాంసన్‌ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. అయితే ఐదవ స్థానంలో సంజూకి దీపక్ హుడా నుంచి పోటీ ఎదురుకానుంది. శాంసన్‌ తుది జట్టులో లేని నేపథ్యంలో వచ్చిన విమర్శల కారణంగా అతడు తుది జట్టులో తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కీపర్ రిషబ్  పంత్‌.. వైస్ కెప్టెన్సీ హోదాలో జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.


ఆల్‌రౌండర్ కోటాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ శార్దూల్ ఠాకూర్ ఆడటం ఖాయం. అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్‌ పేస్ కోటాలో ఆడతారు. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు గాయంతో జట్టుకు దూరమైన చహర్ మళ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా అతడికి  అదనపు బలం. దాంతో ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు కష్టమే. స్పెసలిస్ట్ స్పిన్ కోటాలో యుజ్వేంద్ర చహల్ ఆడతాడు. దాంతో షెహ్‌బాజ్ అహ్మద్‌, కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అవుతారు. 


భారత్ తుది జట్టు (అంచనా): 
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్. 


Also Read: Dinesh Karthik: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!


Also Read: చివరి నిమిషంలో కెప్టెన్సీ నుంచి తొలగించిన బీసీసీఐ.. శిఖర్‌ ధావన్‌ ఏమన్నాడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.