ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ఆడటానికి తమ జట్టు సిద్ధంగా ఉందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. పెర్త్‌లో అయినా లేక గబ్బలో అయినా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్‌తో ఆడటానికి టీమిండియా సిద్ధంగా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టంచేశాడు. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే నైట్ టెస్టు మ్యాచ్‌ ఆడటం ద్వారా డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్రపంచ దేశాల జాబితాలో టీమిండియా 9వ దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఒక ఇన్నింగ్స్‌తో పాటు 46 పరుగుల తేడాతో గెలిచింది. మూడు రోజులు కూడా ఆడకుండానే ఈ మ్యాచ్ ఫలితం తేలిపోవం గమనార్హం. 


గతంలో ఈ తరహా ఫార్మాట్‌కు టీమిండియా పలు సందర్భాల్లో నో చెబుతూ వచ్చినప్పటికీ.. తాజాగా టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా.. ఎరిపైనైనా పింక్ బాల్ మ్యాచ్‌ ఆడగలమని ధీమా వ్యక్తంచేశాడు. ఇదివరకు ఆడిన పింక్ బాల్ మ్యాచ్‌ బాగా అనిపించిందని.. మ్యాచ్ ఆడిన తీరు సైతం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. అందుకే ఇకపై కూడా పింక్ బాల్ టెస్టులకు తాము సిద్ధమేనని కోహ్లీ స్పష్టంచేశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..