India T20 World Cup Squad 2024: మరో క్రికెట్‌ పండుగకు భారత్‌ సిద్ధమైంది. జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలోనే టీమిండియా మెగా టోర్నీకి వెళ్లనుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. భారత వైఎస్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌కు నిరాశ ఎదురైంది. ఈ టోర్నీకి రాహుల్‌ను సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. గాయం కారణంగా ఏడాదిన్నర క్రికెట్‌ దూరమై ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న రిషబ్‌ పంత్‌కు చోటు దక్కింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CSK vs SRH Highlights: కసి తీర్చుకున్న చెన్నై.. చేతులారా చేజార్చుకున్న హైదరాబాద్‌


అజిత్‌ అగార్కర్‌ అధ్యక్షత బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశమై జట్టు కూర్పుపై సమాలోచనలు చేసింది. ఏడాది కాలంగా ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. వీటితో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ప్రదర్శనను కూడా పరిశీలించింది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా సత్తా చాటుతున్న సంజూ శాంసన్‌కు జట్టులో అవకాశం లభించింది. యువ ఆటగాళ్లు శివమ్‌ దుబే, యశస్వీ జైస్వాల్‌కు స్థానం దక్కడం విశేషం. కొందరి ఎంపిక మాత్రం విస్మయం కలిగించింది. వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో భారత్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా భావించే సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ టోర్నీలో కూడా అవకాశం రావడం విస్మయం కలిగించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తా చాటలేని సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యాలకు జట్టులో స్థానం దక్కడంపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది.


జట్టు ఇదే
రోహిత్‌ శర్మ కెప్టెన్‌, హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌, జైస్వాల్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌. 
ట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌.

నెల రోజులు పండగే..
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరగనున్న ఈ పొట్టీ మెగాటోర్నీ జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్‌ 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ టోర్నీ జూన్‌ 29న ముగియనుంది. టోర్నీలో భాగంగా జూన్‌ 5వ తేదీన ఐర్లాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గ్రూపు ఏలో ఉన్న భారత్‌, పాకిస్థాన్‌ న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9వ తేదీన తలపడనున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter