BCCI hails Virat Kohli for his admirable leadership qualities: టీమిండియా స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) శనివారం (జనవరి 15) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీ (Virat Kohli India Test Captaincy)కి విరాట్ గుడ్‌ బై చెప్పేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు అయింది. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం స్వయంగా టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) తొలగించిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా నియమించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్‌ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది. 'టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి అభినందనలు. తన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను కోహ్లీ ఉన్నత శిఖరాలకు చేర్చాడు. 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి.. 40 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రాణించాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. 


Also Read: Virat Kohli - DRS: విరాట్ కోహ్లీ ఆ ధ్యాసలో పడి.. మ్యాచ్‌ గురించి మర్చిపోయాడు: డీన్‌ ఎల్గర్‌


విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా (BCCI Secretary Jay Shah) స్పందించారు. 'టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ నీ కెప్టెన్సీలో భారత జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో నీ సారథ్యంలో సాధించిన విజయాలు ఎంతో ప్రత్యేకం. అవి ఎప్పటికీ మరువలేనివి. కోహ్లీకి అభినందనలు' అని జై షా తన ట్వీటులో పేర్కొన్నారు.




టెస్ట్ కెప్టెన్సీ (Virat Kohli Test Captaincy) కి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ (Virat Kohli Tweet) ఓ పోస్ట్‌ చేశాడు. 'దాదాపు ఏడేళ్ల పాటు సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. నా బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం 120 శాతం కృషి చేశా. జట్టు కోసం ఎంతో కష్టపడ్డాను. బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ధోనీకి కృతజ్ఞతలు' అని కోహ్లీ ట్వీట్ చేశాడు.


Also Read: Secunderabad Club Fire Accident: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తి నష్టం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి