India to play 3 Tests and 3 ODIs in South Africa Tour, T20Is to be played later says BCCI: భారత క్రికెట్ జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు వెళ్లనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా టీమిండియా టెస్ట్, వన్డే, టీ20 సిరీసులు ఆడనుంది. ఈ పర్యటన డిసెంబర్ 17న ఆరంభం అయ్యే టెస్ట్ మ్యాచులో మొదలవనుంది. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' (Omicron) పంజా విసురుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్​ మాత్రమే ఆడుతామని.. టీ20 సిరీస్ తర్వాత ఆడుతామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా శనివారం అధికారికంగా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార‌త జ‌ట్టు ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌ (New Zealand)తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆపై డిసెంబ‌ర్ 17 నుంచి దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ముందుగా ద‌క్షిణాఫ్రికా (South Africa)లో బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా పర్యటనపై పలు సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. టీమిండియా 9 రోజులు ఆలస్యంగా పర్యటనకు వెళుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని తాజాగా బీసీసీఐ స్పష్టం చేసింది. 


Also Read: కత్రీనా కైఫ్‌ వివాహమా.. నాకేం తెలియదు! పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్


దక్షిణాఫ్రికా టూర్ య‌ధావిధి షెడ్యూల్ ప్ర‌కారం జరగనుందని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా (BCCI Secretary Jay Shah) వెల్ల‌డించారు. ఓ జాతీయ మీడియాతో శనివారం జే షా మాట్లాడుతూ... 'భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తుంది. షెడ్యూల్ ప్ర‌కారమే భారత్ అక్కడికి వెళుతుంది. అయితే భారత జట్టు మూడు టెస్టులు మరియు మూడు వన్డేలు మాత్రమే ఆడుతుంది. నాలుగు టీ20 మ్యాచ్‌ల‌ను మాత్రం వాయిదా వేసాం. టీ20 సిరీస్ షెడ్యూల్ తర్వాత ఉంటుంది. ఇందుకు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకుంది' అని అన్నారు. డిసెంబ‌ర్ 17 నుంచి ప్రొటీస్ టూర్ ప్రారంభం కానుండగా.. 8న భారత్ అక్కడికి బయలుదేరనుందని సమాచారం. 


Also Read: Konijeti Rosaiah: ఆంధ్రా రాజకీయాల్లో రోశయ్య చెరగని ముద్ర- ఆయన ప్రస్థానం..


India tour of South Africa Schedule:
Dec 17-21 1st Test
Dec 26-30 2nd Test
Jan 03-07 3rd Test
Jan 11 1st ODI
Jan 14 2nd ODI
Jan 16 3rd ODI


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook