India vs Ireland T20 Series 2022 Schedule, squads Details: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు రెండు పర్యటనలతో బిజీబిజీగా ఉంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఓ జట్టు ఇంగ్లండ్‌ టూర్‌లో ఉండగా.. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని మరో జట్టు ఐర్లాండ్‌లో ఉంది. హార్దిక్ జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌కు ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం. హార్దిక్‌ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన విషయం  తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐర్లాండ్‌తో తలపడబోయే భారత జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, సంజూ సాంసన్, ఇషాన్‌ కిషన్‌ మినహా మిగతా ప్లేయర్స్ అందరూ జూనియర్లే. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఆవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. భారత్‌, ఐర్లాండ్‌ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌, జట్లు, వేదిక, మ్యాచ్‌ ప్రసారాలు లాంటి విషయాలను ఓసారి చూద్దాం. 


భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య మొదటి టీ20 జూన్‌ 26న జరుగుతుంది. డబ్లిన్‌లోని ది విలేజ్‌ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టీ20 జూన్‌ 28 అదే మైదానంలో  రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ టీవీలో భారత్‌, ఐర్లాండ్‌ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ లివ్‌ యాప్‌లో కూడా మ్యాచ్ చూడొచ్చు. 


భారత జట్టు: 
హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), ఆవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయ్. 


ఐర్లాండ్‌ జట్టు:
ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్‌), హ్యారీ టెక్టార్‌, గరేత్‌ డిలనీ, పాల్‌ స్టిర్లింగ్‌, కర్టిస్‌ కాంఫర్‌, స్టీఫెన్‌ డోహ్నీ, లోర్కాన్‌ టకర్‌, మార్క్‌ అడేర్‌, జార్జ్‌ డాక్రెల్‌, జాషువా లిటిల్‌, ఆండీ మెక్‌బ్రిన్‌, బ్యారీ మెకార్టీ, కానర్‌ ఆల్ఫర్ట్‌, క్రెయిగ్‌ యంగ్‌.


Also Read: Friday Lakshmi Puja: శుక్రవారం లక్ష్మీ దేవి పూజ.. ఈ స్త్రోత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి


Also Read: Viral Video: పెళ్లి వేడుకల్లో ఊహించని ఘటన.. వరుడి కాల్పుల్లో జవాన్ మృతి.. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.