India vs Afghanistan ODI Series:  టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ దాదాపు 6 నెలల పాటు వాయిదా పడింది. గత జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. రీసెంట్ గా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అనంతరం ఈ సిరీస్ ఎప్పుడు ఉంటుందనే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత నెల 23 నుంచి జూన్ 30 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఇది రెండు బోర్డుల పరస్పర అంగీకారంతో వాయిదా పడిందని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ కప్ 2023కు ముందు ఎలాంటి సిరీస్‌లు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. దీంతో ఈ సిరీస్ ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నారు. 


ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో టీమిండియా పాల్గొంటుందో లేదో అనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.  సెప్టెంబరు 23న చైనాలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్టుకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. 


Also read: India vs West Indies: క్రికెట్ లవర్స్ కు గుడ్‌న్యూస్.. జియో సినిమాలో ఫ్రీగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్..


తొలిసారిగా ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్టు పాల్గొననుంది. అంతకుముందు 2010, 2014లో ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చారు. అయితే రెండు సార్లు టీమిండియా పాల్గొనలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లోనే క్రికెట్ ఆడనున్నారు. ఈ క్రీడల్లో ఆడేందుకు టీమిండియా పురుషులు బి జట్టు, పూర్తిస్థాయి మహిళల జట్టును పంపే అవకాశం ఉంది. 


Also read: Tamim Iqbal: ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి