ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేసింది. 375 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లాడి 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకు పరిమితమైంది. దీంతో తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో ఆతిథ్య ఆసీస్ జట్టు విజయాన్ని అందుకుంది.



 


తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్‌ స్మిత్‌ (105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలు సాధించడంతో పాటు ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (69; 76 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 374 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, బూమ్రా, సైనీ, చహల్ తలో వికెట్ తీశారు.




375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను ఆసీస్ పేసర్ హజెల్‌వుడ్ దెబ్బతీశాడు. మయాంక్ అగర్వాల్(22)ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ (21), అయ్యర్‌ (2)లను ఔట్ చేసి మరోసారి దెబ్బతీశాడు. ఆపై హార్దిక్‌ పాండ్యా(90; 76 బంతుల్లో 7x4, 4x6), శిఖర్‌ ధావన్‌(74; 86 బంతుల్లో 10x4)లు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. అయితే స్పిన్నర్ ఆడమ్ జంపా స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు సాధించడంతో భారత్ ఓటమి తప్పలేదు. ఛేదనలో తడబడిన భారత్ 308 పరుగులకు పరిమితమై ఆసీస్ పర్యటనలో తొలి ఓటమి చవిచూసింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook