బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్లో ఫోర్ బాదిన కోహ్లీ.. కెప్టెన్‌గా వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ చక్కని సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో 30ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 156 పరుగులతో నిలిచింది. రోహిత్ 101 పరుగులు, కోహ్లీ 29 పరుగులు చేశారు.


మరోవైపు తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ (217) రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి (194), ఏబీ డివిలియర్స్‌(208) తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ ఈ మార్క్‌ అందుకున్నాడు. రోహిత్‌ తర్వాత గంగూలీ (228), సచిన్‌ టెండూల్కర్‌ (235), లారా (239)లు వరుసగా ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..