IND Vs AUS Final Updates: వరల్డ్ కప్ 2023 ఫైనల్ వేడుక ఆరంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. కోట్లాది అభిమానులు టీమిండియా కప్ కొట్టాలని ప్రార్థనలు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు ఫైనల్ ఫైట్ ఆరంభంకానుంది. లీగ్ దశ నుంచి అడ్డొచ్చిన అన్ని జట్లను ఓడిస్తూ భారత్ అజేయంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టగా.. తొలి రెండు మ్యాచ్‌లు మినహాయించి మిగిలిన 8 మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలు సాధించి కంగారూలు ఫైనల్‌కు చేరుకున్నారు. వరల్డ్ కప్ ఆరంభానికి భారత్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నా.. టోర్నీ ఆరంభమై మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పటిష్ట ఆసీస్‌ను తొలి మ్యాచ్‌లో ఓడించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చిత్తు చేసింది. పెద్ద జట్లకు షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టోర్నీలో ఎంతో బలంగా కనిపించిన దక్షిణాఫ్రికాను అలవోకగా ఓడించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి 2019 సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకుంది. ఇక మిగిలింది ఒక్కటే.. ఒకే ఒక్క విజయం. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కూడా రోహిత్ సేన విజయం సాధించి.. మూడోసారి విశ్వకప్‌ను ముద్దాడాలని కోట్లాది మంది భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సొంతగడ్డపై కప్ కొట్టేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని అంటున్నారు. అప్రతిహత విజయాలతో దూసుకువచ్చిన ఈ మ్యాచ్‌లోనూ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శన చేసి కప్ అందిస్తుందని ధీమాతో ఉన్నారు.


టాస్ కీలక పాత్ర పోషిస్తుందా..?


ఈ వరల్డ్ కప్‌లో ఈ స్టేడియంలో టాస్‌దే కీలక పాత్ర. గ్రూప్ దశలో జరిగిన నాలుగు మ్యాచ్‌లో ఛేజింగ్ చేసిన జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఫైనల్లోనూ టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత మ్యాచ్‌ల్లో టీమిండియా దృక్పథం వేరే ఉంది. మొదట బ్యాటింగ్ చేయడం.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను ఒత్తిడిలో నెట్టేయడం అలవాటుగా మార్చుకుంది. ఆ దృష్టిలో భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.  


రోహిత్‌పైనే అందరీ కళ్లు..


టీమిండియాలో అందరూ ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరీ కళ్లు ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని కకలావికలం చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మను ఆసీస్ బౌలర్లు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉండడంతో గేమ్ ప్లాన్ ఛేంజ్ చేసే అవకాశం ఉంది. శుభ్‌మన్‌ గిల్‌తో హిట్టింగ్ చేయించి.. రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించవచ్చు. హిట్‌మ్యాన్ ఎంతసేపు క్రీజ్‌లో ఉంటే.. ఆసీస్‌ బౌలర్లు అంతసేపు ఒత్తిడిలో ఉంటారు. మిగిలినపని పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సిద్ధంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించేందుకు ఇదే సరైన అవకాశం. 


అదే స్పెల్ కావాలి షమీ..


మిగిలిన బౌలర్లు అంతా ఒకవైపు.. షమీ ఒక్కడు ఒక వైపు.. బుమ్రా ఎక్కువగా డాట్‌ బాల్స్ వేసి ఒత్తిడికి గురిచేస్తే.. షమీ వచ్చి చకచకా వికెట్లు తీస్తున్నాడు. వీరిద్దరికి తోడు సిరాజ్ కూడా కాస్త పుంజుకుంటే భారత్‌ బౌలింగ్‌కు తిరుగుండదు. మధ్యలో అడ్డుకట్ట వేసేందుకు జడేజా, కుల్దీప్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. షమీ ఒక్క అద్బుతమైన స్పెల్ వేస్తే.. టీమిండియాకు ఇక తిరుగుండదు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండడంతో సిరాజ్ స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని డిమాండ్లు ఉన్నా.. ఈ సమయంలో రోహిత్ శర్మ రిస్క్ చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. ప్లేయింగ్11 ఎలా ఉన్నా భారత్ మాత్రం కప్‌ కొట్టాలని కోట్లాది మంది కళ్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ టీమిండియా..


టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, కప్ మనదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి