India VS Australia: Pacer James Pattinson Ruled Out Of Sydney Test: ఓవైపు బయోబబుల్ తప్పిదాలు, కరోనా వైరస్ భయాలనుంచి టీమిండియా ఊరట పొందగా.. అదే సమయంలో ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగింది. కీలకమైన మూడో టెస్టుకు ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఛాతీ కండరాల గాయంతో తమ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ కారణంగా అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని వివరించింది. అదే సమయంలో (India vs Australia) సిరీస్‌లో తదుపరి మ్యాచ్‌కు జేమ్స్ పాటిన్సన్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడం లేదని ఆసీస్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. 


Also Read: IND vs AUS 3rd Test: బీసీసీఐ శుభవార్త.. భారత జట్టుకు భారీ ఊరట



పేసర్ జేమ్స్ పాటిన్సన్ ఇంట్లో కింద పడటంతో గాయపడ్డాడు. అందుకే అతడిని సిడ్నీలో జరగనున్న మూడో టెస్టులో తీసుకోవడం లేదని చెప్పారు. అయితే ఆ స్థానం కోసం సీన్ అబాట్, మైఖేల్ నెసర్ ఎదురుచూస్తున్నారు. పాటిన్సన్ ఇప్పటివరకూ 21 మ్యాచ్‌లలో 81 వికెట్లు పడగొట్టి నిరూపించుకున్నాడు. అయితే మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లు ఉండటంతో ఆసీస్ జట్టులో రెగ్యూలర్ పేసర్‌గా చోటు దక్కించుకోలేకపోతున్నాడు.


Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే



కాగా, ఇప్పటివరకూ రెండు టెస్టులు జరగగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కీలకమైన మూడో టెస్టు జనవరి 7న ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, టీమిండియా(Team India)లు విజయంపై కన్నేశాయి. ఈ టోర్నీని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


Also Read: Rohit sharma: శర్మ గారి అబ్బాయి బీఫ్ తిన్నాడా..రోహిత్ శర్మ చుట్టూ బీఫ్ వివాదం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook