గువాహటి వేదికగా ఈ రోజు ఆసీస్ తో రెండో టి 20 సమరానికి కోహ్లీసేన సిద్ధమైంది. వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్ నెగ్గి టి 20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆసీస్ తో ఇటీవలే జరిగిన టెస్టు, వన్డే సిరీస్ ను కోహ్లీ సేన కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టి 20 సిరీస్ కూడా నెగ్గి ఆసీస్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఆసీస్ తో జరిగిన గత ఏడు టి 20 మ్యాచుల్లో భారత్ అన్నింటిల్లోనూ నెగ్గింది. ఈ రికార్డును మరింత పదిలం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరుగుల వరద పారేనా..?


తొలి టి 20లో కోహ్లీసేన విజయం సాధించినప్పటికీ వర్షం అడ్డపడటంతో భారత బ్యాట్స్ మెన్లుకు పరుగుల దాహం తీరలేదు. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించాలని భారత బ్యాట్స్ మెన్లు కసితో ఉన్నారు. ఇదిలా ఉండడా వరుస ఓటములతో ఢీలా పడ్డ స్మిత్ సేన ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.  ఆసీస్ ప్రధానంగా  ఫించ్‌, వార్నర్‌ల మీదే ఆశలు పెట్టుకుంది. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడమే ఇప్పుడు కంగారూ జట్టు ముందున్న అతి పెద్ద సవాల్‌. 


తొలి అంతర్జాతీయ మ్యాచ్ ...


భారత్-ఆసీస్ రెండో టి 20 మ్యాచ్ కు ఆధిత్యం ఇస్తున్న బర్సపర స్టేడియానికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇటీవలే ఈ స్టేడియాన్ని నిర్మించారు..ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామని ..అదే సమయంలో స్పిన్ కు అనుకూలిస్తుందని పిచ్ క్యూరేటర్లు పేర్కొన్నారు. తొలి టి 20 వన్డేలో వర్షం అడ్డుతగలడంతో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మ్యాచ్‌ను ఆస్వాదించలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ లో రాంచీలో మాదిరి రెండో టీ20కి వర్షం ముప్పేమీ లేదని వాతావారణశాఖ పేర్కొంది.