India Vs Bangladesh 3rd Odi Playing 11: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుందనుకుంటే.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. బంగ్లా అనూహ్యంగా ఎదురుదాడికి దిగి.. రెండు వన్డేల్లో భారత్‌కు షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ ఉండగానే గెలుచుకుని.. ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ శనివారం చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాను నిలువరించేందుకు భారత్ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా జట్టు పేలవ ప్రదర్శనతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతోంది. గాయం కారణంగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఓపెనింగ్ స్లాట్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. శిఖర్ ధావన్‌కు తోడు ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారో చూడాలి. రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. గత రెండు వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడిన కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తే.. ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.


కేఎల్ రాహుల్-ధావన్ కుడి ఎడమల కాంబినేషన్ సెట్ అవుతుంది. ఒకవేళ రాహుల్ త్రిపాఠికి జట్టులో ఛాన్స్‌ ఇస్తే.. ధావన్‌కు తోడు అతనే ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్ ఇషాన్‌కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. తొలి రెండు వన్డేల్లో కోహ్లీ తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన షాబాద్‌ అహ్మద్‌కు మరోఛాన్స్ దక్కే అవకాశం ఉంది.


జట్టులోకి కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నా.. కానీ అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడం కష్టం. యంగ్ ఆల్‌రౌండర్‌కు షాబాద్ అహ్మాద్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే భారత్‌కు వికెట్లు తీయగల మంచి బౌలర్ అవసరం ఉంది. చివరి నిమిషంలో మార్పులు చేసే అవకాశం ఉంది. పేస్ బాధ్యతలను శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ పంచుకోనున్నారు. 


మరోవైపు రెండు వన్డేల్లో విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన మెహదీ హసన్‌ మిరాజ్ బంగ్లాదేశ్‌కు హీరోగా మారాడు. మొదటి మ్యాచ్‌లో ఓటమి అంచున నుంచి విజయ తీరాలకు చేర్చగా.. రెండో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు షకిబుల్ హాసన్, మహ్మదుల్లా వంటి ఆల్‌రౌండర్లను బంగ్లా నమ్ముకుంది.పేసర్లు ఎబాదత్‌, ముస్తాఫిజుర్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అంశం. ఈ వన్డేలో కూడా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బంగ్లాదేశ్‌ చూస్తోంది.  


తుది జట్లు (అంచనా):


టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.


బంగ్లాదేశ్: లిటన్ దాస్ (కెప్టెన్), నజ్ముల్ శాంటో, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్. 


Also Read: Mandous Cyclone: దూసుకువస్తున్న మాండస్ తుఫాన్.. ఈ జిల్లాలకు హెచ్చరిక  


Also Read: Revanth Reddy: బీఆర్ఎస్ లెటర్‌లో ఏపీ పేరు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook