భారత్ vs బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్: 222 పరుగులకే చాప చుట్టేసిన బంగ్లాదేశ్
222 పరుగులకే చాప చుట్టేసిన బంగ్లాదేశ్
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట శుభారంభం చేసినట్టుగా కనిపించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత 222 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ గా దిగిన లిటన్ దాస్ సెంచరీ చేయడంతో మొదట 25 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా పడకుండా పరుగులెత్తినట్టుగా కనిపించిన స్కోర్ బోర్డ్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా వికెట్స్ పడుతుండటంతో కుంటుబడిపోయింది. ఓపెనర్లు మినహా ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టడంతో 48.3 ఓవర్లకే ఆలౌట్ అయి 222 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆసియా కప్‌ను 7వ సారి సొంతం చేసుకోవాలంటే.. రోహిత్ సేన 223 పరుగులు చేయాల్సి ఉంటుంది.