Funny Meme On Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాపై Wasim Jaffer ఫన్నీ మీమ్, ట్విట్టర్లో ట్రెండింగ్
Wasim Jaffer meme on Prithvi Shaw: శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షాను ఇంగ్లాండ్ పంపాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈ సందర్భంగా యువ ఆటగాడు పృథ్వీ షాపై ఫన్నీగా స్పందించాడు.
Wasim Jaffer meme on Prithvi Shaw: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మైదానంలో ఎంత చురుకుగా వ్యవహరిస్తాడో, సోషల్ మీడియాలో అంతకుమించి యాక్టివ్‌గా ఉంటాడని తెలిసిందే. ఈ క్రమంలో యువ సంచలనం పృథ్వీ షా జట్టులో అవకాశాలపై పోస్ట్ చేసిన మీమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. క్రికెట్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది.
ముంబై మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వసీం జాఫర్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(/ష్త్రణ 2021)లో పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే భారత జట్టు ఒకేసారి రెండు పర్యటనలకు వెళ్లింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ప్రకటించిన టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ (India vs England Test Series) వెళ్లిన శుభ్‌మన్‌గిల్ ఇటీవల గాయపడ్డాడు. అతడి స్థానంలో పృథ్వీ షా పేరును సూచిస్తూ కొన్ని కథనాలు వచ్చాయి.
Also Read: IPL 2021 Latet News: ఐపీఎల్ కోసం భారీ వ్యూహాలు రచిస్తోన్న BCCI, పలు కీలక నిర్ణయాలు
ఆ కథనాలపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఫన్నీగా స్పందించాడు. పృథ్వీషా ఓ వైపు శ్రీలంక పర్యటన, మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ మీమ్ ట్వీట్ చేశాడు. అజయ్ దేవగణ్ రెండుకాళ్లను ఒక్కో బైకుపై ఉంచి ప్రయాణిస్తున్న ఫొటోలో ఈ సీనియర్ నటుడి స్థానంలో పృథ్వీ షా ఉన్నట్లు మీమ్ వదలగా వైరల్ అవుతోంది.
ఓపెనర్ షా మూడు వన్డేలు, 3 టీ20 సిరీస్ ఆడేందుకుగానూ శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టుకు అదనంగా మరో ఇద్దరు ఓపెనర్లు కావాలని మేనేజ్‌మెంట్ లేఖ రాసినట్లు సమాచారం. లంకలో ఉన్న పృథ్వీ షాను ఇంగ్లాండ్ పంపాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈ సందర్భంగా యువ ఆటగాడు పృథ్వీ షాపై ఫన్నీ (Funny Memes On Prithvi Shaw)గా స్పందించాడు.
Also Read: Anil Kumble: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన క్రికెటర్ అనిల్ కుంబ్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook