INDvsENG 3rd Test: లీడ్స్ టెస్టు తొలిరోజు చూపించిన జోరునే ఇంగ్లాండ్ తర్వాత రోజు కూడా కొనసాగించింది. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ..ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ స్కోరు సాధించారు. టాపార్డర్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. కెప్టెన్‌ జో రూట్‌ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) మరో శతకంతో చెలరేగగా,  డేవిడ్‌ మలాన్‌ (128 బంతుల్లో 70; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్‌ (24 బ్యాటింగ్‌), రాబిన్సన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో రోజు 120/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం ఆట కొనసాగించింది ఇంగ్లండ్‌(England). తొలిరోజు ఆటలో పెద్దగా ప్రభావం చూపని భారత బౌలర్లు రెండోరోజు తొలి గంటలో మాత్రం మెరుగ్గా బంతులేశారు. వెంటనే ఫలితం వచ్చింది.  ఓపెనర్‌ బర్న్స్‌ (61; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను షమీ తీశాడు. కాసేపటికే హామీద్(62)ను జడేజా(Jadeja) వెనక్కి పంపాడు. అనంతరం సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రూట్, మలాన్‌కు జతయ్యాడు. 


Also Read: ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ విడుదల


ముచ్చటగా మూడో శతకం..
భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ..ఈ జోడీ పరుగులు రాబట్టింది. ముఖ్యంగా రూట్(Joe Root)వన్డే తరహా గేమ్ ఆడాడు. ఈ తరుణంలో రూట్, మలాన్ లు ఇద్దరూ 50 మార్కును దాటారు. టీ విరామానికి ముందు మలాన్(Malan) వికెట్ ను సిరాజ్(Sijraj) తీయటంతో మూడో వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బెయిర్ స్టో అండతో రూట్ 124 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. షమీ(Mohammed Shami) స్వల్ప వ్యవధిలో బెయిర్‌ స్టో (29), బట్లర్‌ (7) వికెట్లను తీశాడు. తర్వాత రూట్‌ను బుమ్రా బౌల్డ్‌ చేశాక... టెయిలెండర్లు  ఓవర్టన్, స్యామ్‌ కరన్‌ (15) జట్టు స్కోరును 400పైచిలుకు తీసుకెళ్లారు. ఇటువంటి స్థితిలో భారత్ బ్యాట్స్ మెన్ ఏవిధంగా ఆడతారో చూడాలి.


రికార్డుల మోత..
లీడ్స్(Leads) టెస్టులో శతకం సాధించడం ద్వారా జోరూట్(Joe Root) అరుదైన రికార్డుల్ని నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా ఇప్పటి వరకూ అలిస్టర్ కుక్(Cook) 38 శతకాలతో ఉండగా.. జో రూట్ 39 సెంచరీలతో టాప్‌లోకి దూసుకెళ్లాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌(India)పై నాలుగు సెంచరీలు బాదిన నాలుగో క్రికెటర్‌గా జో రూట్ నిలిచాడు. చివరిగా 2010లో హసీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించాడు. అలానే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆరు సెంచరీలు బాదిన మూడో ఇంగ్లాండ్ క్రికెటర్‌గా జోరూట్ నిలిచాడు. వ్యక్తిగతంగా టెస్టుల్లో జో రూట్‌కి ఇది 23వ సెంచరీ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook