Ind vs Eng 5th Test: ఇండియా ఇంగ్లండ్ 5 టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ రేపు మార్చ్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఉష్ణ ప్రాంతాల్లో జరిగితే చివరి టెస్ట్ మ్యాచ్ శీతల ప్రాంతంలో జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ చివరి టెస్ట్ మ్యాచ్ రేపు మార్చ్ 7 నుంచి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్‌లో , రెండవది విశాఖపట్నంలో, మూడవది రాజ్‌కోట్‌లో, నాలుగవది రాంచీలో జరిగాయి. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్‌ను టీమ్ ఇండియా 3-1తో కైవసం చేసుకుంది. ఇక మిగిలిన చివరి టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు సాదారణ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలో జరిగాయి. చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రం శీతల ప్రాంతం, ప్రస్తుతం ధారాళంగా మంచు కురుస్తున్న రాష్ట్రంలో జరగనుంది. ధర్మశాల వాతావరణం ఇంగ్లండ్ వాతావరణానికి దగ్గరగా ఉండటంతో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి రిలీఫ్ లభిస్తోంది. 


అప్పుడే ధర్మశాల ప్రకృతి ఒడిలో సేదతీరుతూ జలపాతాల్లో జలకాలాడుతున్నారు. ఇంగ్డంల్ వెటెరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇతర క్రికెటర్లతో కలిసి ధర్మశాలలోని నేచురల్ వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ధర్మశాల ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, మంచు కొండలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఇక్కడి వాతావరణం ఇంగ్లండ్ క్రికెటర్లకు సొంత దేశంలో ఉన్న అనుభూతిని కల్గిస్తోంది. ధర్మశాలలోని స్వచ్ఛమైన జలపాతంలో జలకాలాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.



భారీ అంచనాలతో బజ్‌బాల్ అంటూ హల్‌చల్ చేసిన ఇంగ్లండ్ జట్టు పేలవమైన ప్రదర్శనతో టీమ్ ఇండియా ముందు తేలిపోయింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటిని కోల్పోవడంతో సిరీస్ దక్కలేదు. ఇప్పుడు మిగిలిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేయనుంది. 


Also read: T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook